నేడు మహానటి సావిత్రి వర్ధన్తి. తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకొన్న ఆ నటికి, మనము ఏమిచ్చి ఋణం తీర్చుకో గలము. నాటికీ, నేటికి అద్భుత చిత్రంగా నిలిచిన 'మాయాబజార్' లో సావిత్రి నటన అమోఘము. ఆమె నటనకు పరాకాష్ఠ ఈ చిత్రం. ఆ చిత్రంలోని "అహ నా పెళ్ళంట"పాటలో ఆమె హావభావాలు, నటనా చాతుర్యం వర్ణనాతీతం. ఎన్ని సార్లు చూసిన, విసుగు చెందదు. 56 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ చిత్రం, నేటికి అంతే నూతనంగా అలరారుతోంది. గీత రచన పింగళి, సంగీతం ఘంటసాల మాస్టారు.
Wednesday, December 25, 2013
"అహ నా పెళ్ళంట"

Thursday, June 27, 2013
"అంతా బ్రాంతి యేనా జీవితాన సుఖం ఇంతేనా"
మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో చిత్రాలలో తన నటనా కౌశలంతో అటు సినీ జగత్ ను, ఇటు ప్రేక్షకులను మెప్పించారు. తోలో రోజుల్లో, సినిమా కు పనికి రావని చెప్పిన వారె, తరువాత ఆమెను అందలం ఎక్కించారు. వినోద పిక్చర్స్ "దేవదాసు" తో ఆమె నటనా జీవితం గొప్ప మలుపు తిరిగింది. అక్కినేని తో డయలాగు చెప్పడానికి బయపడిన సావిత్రి ( చిత్రం: సంసారం) తరువాయి కాలంలో అక్కినేనితో ఎన్నో చిత్రాలలో నాయిక గా నటించి శబాష్ అనిపించు కొంది. దేవదాసు చిత్రం విడుదలై 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో (23-06-1953............. 23-06-2013), ఆ చిత్రంలోని "అంతా బ్రాంతి యేనా జీవితాన సుఖం ఇంతేనా" పాటకు సావిత్రి నటన ఎంత అద్భతం గా ఉందొ చూద్దాము. గీత రచన సముద్రాల సీనియర్ , సంగీతం C R సుబ్బరామన్. వీడియో రాకపోతే, యూ ట్యూబ్ ద్వారా పాటను వీక్షించ గలరు.
Subscribe to:
Posts (Atom)