Pages

Wednesday, July 4, 2012

"ఓహో మేఘమాల నీలాల మేఘమాలా"

నటనా శిరోమణి -హావ భావాలూ

1950 లో సాధనా వారి "సంసారం" చిత్రంలో సావిత్రి కి రెండవ  నాయికగా, అవకాశం వచ్చినా, నాగేశ్వర రావు ముందు, డయలాగ్ చెప్పడానికి బయపడితే, ఆమెను ఆ పాత్ర నుండి తప్పించి వేరొక చిన్న పాత్ర ఇచ్చారట. తరువాయి కాలంలో అదే నాగేశ్వర రావుతో, ఎన్నో చిత్రాలలో పోటా పోటిగా నటించి, మెప్పించిన మహానటి ఆమె.   
                                                                          
 1956 లో వచ్చిన "భలే రాముడు" చిత్రంలో పి.లీల పాడిన  "ఓహో మేఘమాల నీలాల మేఘమాలా"   పాటలో, ఆమె హావభావాలు చూడండి. లేత మోముతో, ఆమె ప్రదర్శించిన ముఖ కవళికలు ఈ పాటకు వన్నె తెచ్చాయి. ఘంటసాల గారు ఎంత మధురంగా పాడారో, లీల గారు కూడా అంత మధురంగా పాడారు. పాటను ఆస్వాదించండి.  గానం: లీల.  స్వరం: శ్రీ సాలూరు రాజేశ్వర రావు  కలం: శ్రీ సదాశివబ్రహ్మం గారు. మంచి మెలోడి పాట.  నిత్య నూతనంగా ఉన్న పాట.





Tuesday, July 3, 2012

"అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం"

సావిత్రి గారు అసాధారణ  నటి అని దేవదాస్ చిత్రం తోనే రుజువైంది. ఎన్నో చిత్రాలలో తన నటనా చాతుర్యంతో, ఇటు తెలుగు, అటు తమిళ  ప్రేక్షకులను కంట తడి పెట్టించిన నటనా శిరోమణి. ఎన్నో చిత్రాలు, ఆమె నటన వల్లే, విజయం సాదించింది అనడం అతిశయోక్తి కాదు. రక్తసంబంధం, బ్రతుకు తెరువు, మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి, సుమంగళి, అర్ధాంగి, ఆత్మబంధువు,  కోడలు దిద్దిన కాపురం, మొదలగునవి మచ్చుకు  కొన్ని మాత్రమే. బ్రతుకు తెరువు చిత్రంలో పి. లీల పాడిన "అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం" లో ఆమె నటనా చాతుర్యం చూడండి. అలాగే ఆ పాట మాధుర్యాన్ని ఆనందించండి. గీత రచన శ్రీ సముద్రాల జూనియర్, సంగీతం ఘంటసాల గారు.