Pages

Thursday, February 16, 2012

నీ చెలిమి నేడే కోరితిని.

 


సావిత్రి నటన సునాయాసంగా,సహజంగా ఉంటుంది. తను ధరించే పాత్రకు నూరు శాతం న్యాయం చేకూరుస్తుంది. అదే ఆమె గొప్పతనం. నేడు గోల్డెన్ జూబిలీ (స్వర్ణోత్సవం)  జరుపుకొంటున్న చిత్రం  
జగపతి పిక్చర్స్ "ఆరాధన." ఈ చిత్రం 16-02-1962  లో విడుదల అయ్యింది. ఇందులో సావిత్రి గారిది డాక్టర్ అనురాధ పాత్ర. తనకు డాక్టర్ మురళి కృష్ణ (అక్కినేని) ప్రేమ లేఖ రాసాడని, అపార్థం చేసుకొని, అతనికి విదేశం వెళ్ళే అవకాశం పోగుడుతుంది. తరువాత నిజం తెలుసుకొని, అతన్ని ఆరాదిస్తుంది. అనురాధ పాత్రలో నటించింది అనడం కన్నా, ఆ పాత్రలో జీవించింది అనడం సబబుగా ఉంటుందేమో. సావిత్రి మీద చిత్రీకరించిన "నీ చెలిమి నేడే కోరితిని, ఈ క్షణమే ఆశ వీడితిని," పాట, ఎంత మధురమో, ఆమె నటన అంత సునాయాసం, అద్భుతం. చిత్ర దర్శకుడు శ్రీ వి. మధుసూదన్ రావు గారు అంత బాగా చిత్రీకరించారు. సుశీల గారు అంత శ్రావ్యంగా పాడారు. సంగీతం:సాలూరు రాజేశ్వర రావు . గీత రచన: ఆత్రేయ.

1 comment:


  1. నీ చెలిమీ నేడే కోరితినీ
    ఈక్షణమే ఆశ వీడితినీ
    పూవు వలె ప్రేమ దాచితినీ
    పూజకు నే నోచనై తినీ

    మనసు తెలిసిన మన్నింతువని
    తీయని వూహల తేలితి నేనే
    పరుల సొమ్మై పోయినావని
    నలిగె నా మనసే

    చెదరి పోయిన హృదయములోనా
    పదిల పరచిన మమతలు నీకే
    భారమైన దూరమైన బ్రతుకు నీ కొరకే

    ReplyDelete