నటనా శిరోమణి -హావ భావాలూ
1950 లో సాధనా వారి "సంసారం" చిత్రంలో సావిత్రి కి రెండవ నాయికగా, అవకాశం వచ్చినా, నాగేశ్వర రావు ముందు, డయలాగ్ చెప్పడానికి బయపడితే, ఆమెను ఆ పాత్ర నుండి తప్పించి వేరొక చిన్న పాత్ర ఇచ్చారట. తరువాయి కాలంలో అదే నాగేశ్వర రావుతో, ఎన్నో చిత్రాలలో పోటా పోటిగా నటించి, మెప్పించిన మహానటి ఆమె.
1956 లో వచ్చిన "భలే రాముడు" చిత్రంలో పి.లీల పాడిన "ఓహో మేఘమాల నీలాల మేఘమాలా" పాటలో, ఆమె హావభావాలు చూడండి. లేత మోముతో, ఆమె ప్రదర్శించిన ముఖ కవళికలు ఈ పాటకు వన్నె తెచ్చాయి. ఘంటసాల గారు ఎంత మధురంగా పాడారో, లీల గారు కూడా అంత మధురంగా పాడారు. పాటను ఆస్వాదించండి. గానం: లీల. స్వరం: శ్రీ సాలూరు రాజేశ్వర రావు కలం: శ్రీ సదాశివబ్రహ్మం గారు. మంచి మెలోడి పాట. నిత్య నూతనంగా ఉన్న పాట.
No comments:
Post a Comment