సావిత్రి గారు అసాధారణ నటి అని దేవదాస్ చిత్రం తోనే
రుజువైంది. ఎన్నో చిత్రాలలో తన నటనా చాతుర్యంతో, ఇటు తెలుగు, అటు తమిళ
ప్రేక్షకులను కంట తడి పెట్టించిన నటనా శిరోమణి. ఎన్నో చిత్రాలు, ఆమె నటన
వల్లే, విజయం సాదించింది అనడం అతిశయోక్తి కాదు. రక్తసంబంధం, బ్రతుకు తెరువు, మూగమనసులు,
డాక్టర్ చక్రవర్తి, సుమంగళి, అర్ధాంగి, ఆత్మబంధువు, కోడలు దిద్దిన కాపురం,
మొదలగునవి మచ్చుకు కొన్ని మాత్రమే. బ్రతుకు తెరువు చిత్రంలో పి. లీల పాడిన "అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం" లో ఆమె నటనా చాతుర్యం చూడండి. అలాగే ఆ పాట మాధుర్యాన్ని ఆనందించండి. గీత రచన శ్రీ సముద్రాల జూనియర్, సంగీతం ఘంటసాల గారు.
No comments:
Post a Comment