Pages

Tuesday, November 25, 2014

"నా పాట నీ నోట పలకాల సిలకా"




మరపురాని మరువలేని మహా నటి సావిత్రి . ఎన్నో చిత్రాలలో తన సహజ నటనతో, ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన  మహానటి..  అలనాడు దేవదాస్, మాయాబజార్, మాంగల్య బలం ,
రక్తసంబందం, దేవత, మంచి మనసులు, మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి .నర్తనశాల, ఎన్నో, ఎన్నెన్నో చిత్రాలలో నటించి/జీవించి  నిష్క్రమించిన మానవతా వనిత. ఎన్నో దానాలు చేసిన దానశీలి. 

నటనలో, పాటల సన్నివేశాలలో ఆమె ముఖ కవళికలు అద్భుతంగా ప్రదర్శిస్తుంది. కళ్ళ తోనే మాటలు పలికించ గల నటనా శిరోమణి. పాటలప్పుడు  తెర మీద సావిత్రి ని  క్లోజ్ అప్ లో చూపిస్తే ,ఆమె అందం రెట్టింపై,. ఆమె  హావభావాలకు మురిసిపోని ప్రేక్షకుడు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. 

మూగ మనసులు చిత్రం లోని పాట    "నా పాట నీ నోట పలకాల సిలకా"
ఒక అద్భుతమైన గీతం.  ఎంత అందంగా ఉందొ సావిత్రి. అంతే హుషారుగా నటించి, పాటకు, 
చిత్రానికి ప్రాణం పోసింది. 

చిత్రంలో నటించిన అక్కినేని, లెరు. సావిత్రి లేదు, దర్శకుడు ఆదుర్తి లేరు, సంగీత దర్శకుడు మహదేవన్ లేరు, గీత రచయిత ఆత్రేయ గారు లేరు.  కాని ఈ పాట  అజరామరంగా నిలిచి పోయింది. సావిత్రి నటనకు  ఒక మైలు రాయిగా నిలిచి పోయిన చిత్రం ;మూగమనసులు



No comments:

Post a Comment