Pages

Tuesday, February 14, 2012

మహానటి సావిత్రి: సహజ నటనా శిరోమణి

మహానటి సావిత్రి: సహజ నటనా శిరోమణి: సహజ నటనకు పెట్టింది పేరు సావిత్రి గారు. ఆమె గొప్ప నటి అని, అందరూ ఏకగ్రీవంగా అంగీకరించిన సత్యము. అన్నపూర్ణ వారి మొదటి చిత్రం "దొంగరాముడు" ల...

సహజ నటనా శిరోమణి

సహజ నటనకు పెట్టింది పేరు సావిత్రి గారు. ఆమె గొప్ప నటి అని, అందరూ ఏకగ్రీవంగా అంగీకరించిన సత్యము. అన్నపూర్ణ వారి మొదటి చిత్రం "దొంగరాముడు" లో అక్కినేని సరసన కథా నాయికగా నటించిన విషయం అందరికి తెలిసిందే కదా.  ఆ చిత్రంలో, ఆమెది కూరగాయలు అమ్మేసీత పాత్ర.  తల మీద గంప పెట్టుకొని, కూరలు అమ్మే సీన్ షూటింగ్ జరుగుతోందట. ఖాలీ గంపను, తల మీద పెట్టుకొని నటించమంటే, ఆమె ఒప్పుకోలేదట. గంప లో కూరగాయలు ఉంటెనే, నటించడానికి సహజత్వం వస్తుందని చెప్పి, కూరగాయలు తెప్పించి, గంపలో పెట్టుకొని, పాత్రలో జీవిన్చిందని, విన్నాను. సహజత్వానికి విలువ నిచ్చేనటనా శిరోమణి ఆమె. ఈ చిత్రంలో సావిత్రి మీద చిత్రీకరించిన పాట "అందచందాల సొగసరి వాడు, విందు బోంచేయ వస్తాడు నేడు," వినండి, వీడియో క్లిప్పింగ్ చూడండి, ఆనందించండి. గీత రచన: సముద్రాల, సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు. చిత్రం విడుదల:01-10-1955. చిత్ర దర్శకుడు: కదిరి వెంకట్ రెడ్డి గారు.
 
 

Thursday, February 9, 2012

సావిత్రి అసాధారణ నటన

సావిత్రి గారు అసాధారణ  నటి అని దేవదాస్ చిత్రం తోనే రుజువైంది. ఎన్నో చిత్రాలలో తన నటనా చాతుర్యంతో, ఇటు తెలుగు, అటు తమిళ  ప్రేక్షకులను కంట తడి పెట్టించిన నటనా శిరోమణి. ఎన్నో చిత్రాలు, ఆమె నటన వల్లే, విజయం సాదించింది అనడం అతిశయోక్తి కాదు. రక్తసంబంధం, మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి, సుమంగళి, అర్ధాంగి, ఆత్మబంధువ  కోడలు దిద్దిన కాపురం, మొదలగునవి మచ్చుకు  కొన్ని మాత్రమే.
రక్తసంబంధం చిత్రంలోని ఈ పాటలో ఆమె కనపరచిన హావ భావాలూ అమోఘం. పాడిన వారు:ఘంటసాల, సుశీల. సంగీతం: ఘంటసాల. రచన:అనిశెట్టి. ఘంటసాల, సుశీల గారలు ఎంత భావయుక్తంగా పాడారో గమనించండి. 

Monday, February 6, 2012

అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి పోటీ పడి నటించిన చిత్రం "దేవదాస్". ఈ చిత్రం లోని పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందినవి.  ఆ నాటికీ, ఈ నాటికీ, ఏ నాటికీ మరువలేని, మధురమైన పాటలు/ఆణిముత్యాలు. శ్రీ చింతామణి రామ సుబ్బరామన్ అందించిన సంగీతం, ఒక యుగానికి సరిపడేంత లా నిలిచిపాయింది. ఆ చిత్రం లోని ఈ పాటను ఆస్వాదించండి. రచన :సీనియర్ సముద్రాల, పడిన వారు: రాణి. సావిత్రి నటనకు జోహార్లు తెలపండి.

Friday, February 3, 2012

నటనా శిరోమణి -హావ భావాలూ

1950 లో సాధనా వారి "సంసారం" చిత్రంలో సావిత్రి కి రెండవ  నాయికగా, అవకాశం వచ్చినా, నాగేశ్వర రావు ముందు, డయలాగ్ చెప్పడానికి బయపడితే, ఆమెను ఆ పాత్ర నుండి తప్పించి వేరొక చిన్న పాత్ర ఇచ్చారట. తరువాయి కాలంలో అదే నాగేశ్వర రావుతో, ఎన్నో చిత్రాలలో పోటా పోటిగా నటించి, మెప్పించిన మహానటి ఆమె. 
 పద్మశ్రీ వారి "సిరిసంపదలు" చిత్రంలో నాగేశ్వర రావు సరసన,  ఈ పాటలో, ఆమె హావభావాలు చూడండి, పాటను ఆస్వాదించండి.  గానం:ఘంటసాల,సుశీల , స్వరం:మాస్టర్ వేణు. కలం:ఆత్రేయ

 

Tuesday, January 31, 2012

natana shiromani Savithri

అలనాటి నాయికలలో, ప్రథమ స్థానంలో నిలబడే అర్హత ఒక్క సావిత్రి గారికి ఉంది అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు అని సాహసించి చెప్పగలను. తన నటనా  చాతుర్యంతో దక్షిణ భారత మరియు  హిందీ చిత్రసీమలను  శాసించిన నటనా శిరోమణి ఆమె.  తొలి అవకాశం, అగ్నిపరీక్ష అనే చిత్రంలో వచ్చినా, ఆ పాత్రకు చిన్న పిల్లలా ఉందని, వచ్చిన అవకాశం పోయింది. తరువాత, 1950 లో సాధన చిత్రం వారి "సంసారం" లో 2nd హీరోయిన్గా అవకాశం వచ్చినా, నాగేశ్వర రావు ముందు డయలాగు చెప్పడానికి  బయపడితే, ఆ పాత్రకు పుష్పలతను పెట్టుకొని, సావిత్రికి చిన్న వేషం ఇచ్చారట. ఈ చిత్రం విడుదల తరువాత, ఆమె లోని ప్రతిభను గుర్తించి, 1951 లో పల్లెటూరు, సాహుకారు చిత్రాలలో అవకాశం వచ్చింది. కానీ 1952 లో వచ్చిన "పెళ్లి చేసి చూడు"లో రెండవ హీరోయిన్ గా వేసిన తరువాత, ఇంక మళ్లీ వెనుక తిరిగి చూడ లేదు. ముఖ కవళికలకు, కళ్ళతోనే భావాలూ తెలియ పరచడంలో, ఆమెకు ఆమే సాటి. అందుకే ఆమె మహానటి అయ్యింది. ఆమె నటించిన "చదువుకున్న అమ్మాయిలు" చిత్రంలోని  ఈ పాటలో ఆమె హావభావాలు చూడండి, పాటను విని ఆనందించండి.