Pages

Friday, December 5, 2014

1. వినిపించని రాగాలే ...... 2 వెన్నెలలోని వికాసమే

నేడు మహానటి సావిత్రి  78 వ జయంతి . నర  నరాల్లో ఆమె జ్ఞాపకాలు నిలిచిపోయిన ప్రేక్షకులకు, ఆమె జయంతి లేక వర్ధంతి తో నిమిత్తం లేదు.  కాని ఆమెను మళ్ళి మళ్ళి స్మరించుకోవడం  ఎంతైనా అవసరం. ఆమె లాంటి నటి ఇంక రారు.   కేవకం కళ్ళ తోనే హావభావాలు పలికించే గొప్ప నటి. అంతకు మించి  మహా దాత. మహా ఇల్లాలు. నటనకు బాష్యం చెప్పిన నటనా శిరోమణి.
 నాకు చాలా ఇష్టమైన రెండు పాటలు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. దృశ్యం చూసి, పాట విని ఆమెకు నివాళి అర్పిద్దాం 
1. వినిపించని రాగాలే .... 2. వెన్నెలలోని వికాసమే 












Tuesday, November 25, 2014

"నా పాట నీ నోట పలకాల సిలకా"




మరపురాని మరువలేని మహా నటి సావిత్రి . ఎన్నో చిత్రాలలో తన సహజ నటనతో, ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన  మహానటి..  అలనాడు దేవదాస్, మాయాబజార్, మాంగల్య బలం ,
రక్తసంబందం, దేవత, మంచి మనసులు, మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి .నర్తనశాల, ఎన్నో, ఎన్నెన్నో చిత్రాలలో నటించి/జీవించి  నిష్క్రమించిన మానవతా వనిత. ఎన్నో దానాలు చేసిన దానశీలి. 

నటనలో, పాటల సన్నివేశాలలో ఆమె ముఖ కవళికలు అద్భుతంగా ప్రదర్శిస్తుంది. కళ్ళ తోనే మాటలు పలికించ గల నటనా శిరోమణి. పాటలప్పుడు  తెర మీద సావిత్రి ని  క్లోజ్ అప్ లో చూపిస్తే ,ఆమె అందం రెట్టింపై,. ఆమె  హావభావాలకు మురిసిపోని ప్రేక్షకుడు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. 

మూగ మనసులు చిత్రం లోని పాట    "నా పాట నీ నోట పలకాల సిలకా"
ఒక అద్భుతమైన గీతం.  ఎంత అందంగా ఉందొ సావిత్రి. అంతే హుషారుగా నటించి, పాటకు, 
చిత్రానికి ప్రాణం పోసింది. 

చిత్రంలో నటించిన అక్కినేని, లెరు. సావిత్రి లేదు, దర్శకుడు ఆదుర్తి లేరు, సంగీత దర్శకుడు మహదేవన్ లేరు, గీత రచయిత ఆత్రేయ గారు లేరు.  కాని ఈ పాట  అజరామరంగా నిలిచి పోయింది. సావిత్రి నటనకు  ఒక మైలు రాయిగా నిలిచి పోయిన చిత్రం ;మూగమనసులు



Wednesday, December 25, 2013

"అహ నా పెళ్ళంట"







నేడు మహానటి సావిత్రి వర్ధన్తి.  తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకొన్న ఆ నటికి, మనము ఏమిచ్చి ఋణం తీర్చుకో గలము. నాటికీ, నేటికి అద్భుత చిత్రంగా నిలిచిన 'మాయాబజార్' లో సావిత్రి నటన అమోఘము.   ఆమె నటనకు పరాకాష్ఠ  ఈ చిత్రం.  ఆ చిత్రంలోని "అహ నా పెళ్ళంట"పాటలో ఆమె హావభావాలు, నటనా చాతుర్యం వర్ణనాతీతం. ఎన్ని సార్లు చూసిన, విసుగు చెందదు. 56 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ చిత్రం, నేటికి అంతే నూతనంగా అలరారుతోంది. గీత రచన పింగళి, సంగీతం ఘంటసాల మాస్టారు.



Thursday, June 27, 2013

"అంతా బ్రాంతి యేనా జీవితాన సుఖం ఇంతేనా"

మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో చిత్రాలలో తన నటనా కౌశలంతో అటు సినీ జగత్ ను, ఇటు ప్రేక్షకులను మెప్పించారు. తోలో రోజుల్లో, సినిమా కు పనికి రావని చెప్పిన వారె, తరువాత ఆమెను అందలం ఎక్కించారు.  వినోద పిక్చర్స్ "దేవదాసు" తో ఆమె నటనా జీవితం గొప్ప మలుపు తిరిగింది.  అక్కినేని తో డయలాగు చెప్పడానికి బయపడిన సావిత్రి ( చిత్రం: సంసారం) తరువాయి కాలంలో అక్కినేనితో ఎన్నో చిత్రాలలో నాయిక  గా నటించి శబాష్ అనిపించు కొంది.  దేవదాసు చిత్రం విడుదలై 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో (23-06-1953............. 23-06-2013), ఆ చిత్రంలోని   "అంతా బ్రాంతి యేనా జీవితాన సుఖం ఇంతేనా" పాటకు సావిత్రి నటన ఎంత  అద్భతం గా ఉందొ చూద్దాము.  గీత రచన సముద్రాల సీనియర్ , సంగీతం C R సుబ్బరామన్. వీడియో రాకపోతే, యూ ట్యూబ్ ద్వారా పాటను వీక్షించ గలరు.







Thursday, December 6, 2012

మహానటి సావిత్రి 77 వ జయంతి నేడు.


Mahanati Savitri

మహానటి సావిత్రి 77 వ జయంతి నేడు. ఎన్నో చిత్రాలలో తన అసమాన నటనతో దక్షిణాది ప్రేక్షకులను ఓల లాడించిన మేటి నటి; ఆమె నటన "మాయాబజార్, దేవదాస్, సంతానం, భలే రాముడు, దేవత, రక్త సంబంధం, మంచి మనసులు, మూగ మనసులు, ఆరాధన,   వెలుగు నీడలు మాంగల్యబలం, సిరిసంపదలు, మొదలగు ఎన్నో చిత్రాలలో మరపురాని నటన తో ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షక హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకొన్న మహానటి సావిత్రి గారు. తన చివర దశలో దుర్భర జీవితం అనుభవించి పరలోకం చేరుకొన్న మహానటి సావిత్రి .
ఆ మహానటికి అశ్రుతర్పనాలు అందిద్దాం.  ఆమె నటించిన/ జీవించిన చిత్రం మాయాబజార్ లోని "అహ  నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట" క్లిప్పింగ్ చూద్దాము.


Wednesday, December 5, 2012

"చందురుని మించు అంద మొలికించు ముద్దు పాపయివే




మహానటి సావిత్రి గారి 77 వ జయంతి సందర్బంగా "రక్తసంబంధం" చిత్రంలోని "చందురుని మించు అంద మొలికించు  ముద్దు పాపయివే" అనే పాటను పోస్ట్ చేస్తున్నాను. ఘంటసాల మాస్టారు, సుశీల ఎంతో   ఆర్ ద్రతతో పాడిన పాట , వింటూ ఉంటె మనసు ద్రవించి పోతుంది . సావిత్రి గారి నటన అమోఘం, అసమానం,అద్భుతం .ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల మాస్టారు.




Wednesday, July 4, 2012

"ఓహో మేఘమాల నీలాల మేఘమాలా"

నటనా శిరోమణి -హావ భావాలూ

1950 లో సాధనా వారి "సంసారం" చిత్రంలో సావిత్రి కి రెండవ  నాయికగా, అవకాశం వచ్చినా, నాగేశ్వర రావు ముందు, డయలాగ్ చెప్పడానికి బయపడితే, ఆమెను ఆ పాత్ర నుండి తప్పించి వేరొక చిన్న పాత్ర ఇచ్చారట. తరువాయి కాలంలో అదే నాగేశ్వర రావుతో, ఎన్నో చిత్రాలలో పోటా పోటిగా నటించి, మెప్పించిన మహానటి ఆమె.   
                                                                          
 1956 లో వచ్చిన "భలే రాముడు" చిత్రంలో పి.లీల పాడిన  "ఓహో మేఘమాల నీలాల మేఘమాలా"   పాటలో, ఆమె హావభావాలు చూడండి. లేత మోముతో, ఆమె ప్రదర్శించిన ముఖ కవళికలు ఈ పాటకు వన్నె తెచ్చాయి. ఘంటసాల గారు ఎంత మధురంగా పాడారో, లీల గారు కూడా అంత మధురంగా పాడారు. పాటను ఆస్వాదించండి.  గానం: లీల.  స్వరం: శ్రీ సాలూరు రాజేశ్వర రావు  కలం: శ్రీ సదాశివబ్రహ్మం గారు. మంచి మెలోడి పాట.  నిత్య నూతనంగా ఉన్న పాట.