Pages

Thursday, December 6, 2012

మహానటి సావిత్రి 77 వ జయంతి నేడు.


Mahanati Savitri

మహానటి సావిత్రి 77 వ జయంతి నేడు. ఎన్నో చిత్రాలలో తన అసమాన నటనతో దక్షిణాది ప్రేక్షకులను ఓల లాడించిన మేటి నటి; ఆమె నటన "మాయాబజార్, దేవదాస్, సంతానం, భలే రాముడు, దేవత, రక్త సంబంధం, మంచి మనసులు, మూగ మనసులు, ఆరాధన,   వెలుగు నీడలు మాంగల్యబలం, సిరిసంపదలు, మొదలగు ఎన్నో చిత్రాలలో మరపురాని నటన తో ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షక హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకొన్న మహానటి సావిత్రి గారు. తన చివర దశలో దుర్భర జీవితం అనుభవించి పరలోకం చేరుకొన్న మహానటి సావిత్రి .
ఆ మహానటికి అశ్రుతర్పనాలు అందిద్దాం.  ఆమె నటించిన/ జీవించిన చిత్రం మాయాబజార్ లోని "అహ  నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట" క్లిప్పింగ్ చూద్దాము.


Wednesday, December 5, 2012

"చందురుని మించు అంద మొలికించు ముద్దు పాపయివే




మహానటి సావిత్రి గారి 77 వ జయంతి సందర్బంగా "రక్తసంబంధం" చిత్రంలోని "చందురుని మించు అంద మొలికించు  ముద్దు పాపయివే" అనే పాటను పోస్ట్ చేస్తున్నాను. ఘంటసాల మాస్టారు, సుశీల ఎంతో   ఆర్ ద్రతతో పాడిన పాట , వింటూ ఉంటె మనసు ద్రవించి పోతుంది . సావిత్రి గారి నటన అమోఘం, అసమానం,అద్భుతం .ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల మాస్టారు.




Wednesday, July 4, 2012

"ఓహో మేఘమాల నీలాల మేఘమాలా"

నటనా శిరోమణి -హావ భావాలూ

1950 లో సాధనా వారి "సంసారం" చిత్రంలో సావిత్రి కి రెండవ  నాయికగా, అవకాశం వచ్చినా, నాగేశ్వర రావు ముందు, డయలాగ్ చెప్పడానికి బయపడితే, ఆమెను ఆ పాత్ర నుండి తప్పించి వేరొక చిన్న పాత్ర ఇచ్చారట. తరువాయి కాలంలో అదే నాగేశ్వర రావుతో, ఎన్నో చిత్రాలలో పోటా పోటిగా నటించి, మెప్పించిన మహానటి ఆమె.   
                                                                          
 1956 లో వచ్చిన "భలే రాముడు" చిత్రంలో పి.లీల పాడిన  "ఓహో మేఘమాల నీలాల మేఘమాలా"   పాటలో, ఆమె హావభావాలు చూడండి. లేత మోముతో, ఆమె ప్రదర్శించిన ముఖ కవళికలు ఈ పాటకు వన్నె తెచ్చాయి. ఘంటసాల గారు ఎంత మధురంగా పాడారో, లీల గారు కూడా అంత మధురంగా పాడారు. పాటను ఆస్వాదించండి.  గానం: లీల.  స్వరం: శ్రీ సాలూరు రాజేశ్వర రావు  కలం: శ్రీ సదాశివబ్రహ్మం గారు. మంచి మెలోడి పాట.  నిత్య నూతనంగా ఉన్న పాట.





Tuesday, July 3, 2012

"అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం"

సావిత్రి గారు అసాధారణ  నటి అని దేవదాస్ చిత్రం తోనే రుజువైంది. ఎన్నో చిత్రాలలో తన నటనా చాతుర్యంతో, ఇటు తెలుగు, అటు తమిళ  ప్రేక్షకులను కంట తడి పెట్టించిన నటనా శిరోమణి. ఎన్నో చిత్రాలు, ఆమె నటన వల్లే, విజయం సాదించింది అనడం అతిశయోక్తి కాదు. రక్తసంబంధం, బ్రతుకు తెరువు, మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి, సుమంగళి, అర్ధాంగి, ఆత్మబంధువు,  కోడలు దిద్దిన కాపురం, మొదలగునవి మచ్చుకు  కొన్ని మాత్రమే. బ్రతుకు తెరువు చిత్రంలో పి. లీల పాడిన "అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం" లో ఆమె నటనా చాతుర్యం చూడండి. అలాగే ఆ పాట మాధుర్యాన్ని ఆనందించండి. గీత రచన శ్రీ సముద్రాల జూనియర్, సంగీతం ఘంటసాల గారు.
 



Monday, June 4, 2012

"అలిగినవేలనే చూడాలి గోకుల కృష్ణుని అందాలూ"

మహానటి సావిత్రి -- కేవలం కళ్ళతోనే హావ భావాలూ ప్రదర్సించగల మేటి నటి.  నాటికీ, నేటికి ఆమె గొప్ప నటి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. గుండమ్మ కథ చిత్రంలో సావిత్రి ప్రదర్శించిన నటన అమోఘం. సావిత్రి, రామ రావు గార్ల మీద చిత్రీకరించిన "అలిగినవేలనే చూడాలి గోకుల కృష్ణుని అందాలూ" పాట చాల మంచి పాట. రచన శ్రీ పింగళి నాగేంద్ర రావు , సంగీతం: ఘంటసాల మాస్టారు. ఆ పాట వినండి.సావిత్రి నటనకు జోహార్లు తెలపండి.


Thursday, February 16, 2012

నీ చెలిమి నేడే కోరితిని.

 


సావిత్రి నటన సునాయాసంగా,సహజంగా ఉంటుంది. తను ధరించే పాత్రకు నూరు శాతం న్యాయం చేకూరుస్తుంది. అదే ఆమె గొప్పతనం. నేడు గోల్డెన్ జూబిలీ (స్వర్ణోత్సవం)  జరుపుకొంటున్న చిత్రం  
జగపతి పిక్చర్స్ "ఆరాధన." ఈ చిత్రం 16-02-1962  లో విడుదల అయ్యింది. ఇందులో సావిత్రి గారిది డాక్టర్ అనురాధ పాత్ర. తనకు డాక్టర్ మురళి కృష్ణ (అక్కినేని) ప్రేమ లేఖ రాసాడని, అపార్థం చేసుకొని, అతనికి విదేశం వెళ్ళే అవకాశం పోగుడుతుంది. తరువాత నిజం తెలుసుకొని, అతన్ని ఆరాదిస్తుంది. అనురాధ పాత్రలో నటించింది అనడం కన్నా, ఆ పాత్రలో జీవించింది అనడం సబబుగా ఉంటుందేమో. సావిత్రి మీద చిత్రీకరించిన "నీ చెలిమి నేడే కోరితిని, ఈ క్షణమే ఆశ వీడితిని," పాట, ఎంత మధురమో, ఆమె నటన అంత సునాయాసం, అద్భుతం. చిత్ర దర్శకుడు శ్రీ వి. మధుసూదన్ రావు గారు అంత బాగా చిత్రీకరించారు. సుశీల గారు అంత శ్రావ్యంగా పాడారు. సంగీతం:సాలూరు రాజేశ్వర రావు . గీత రచన: ఆత్రేయ.

ఆరాధన(1962)"వెన్నెలలోని వికాసమే"


 

సావిత్రి నటన సునాయాసంగా,సహజంగా ఉంటుంది. తను ధరించే పాత్రకు నూరు శాతం న్యాయం చేకూరుస్తుంది. అదే ఆమె గొప్పతనం. నేడు గోల్డెన్ జూబిలీ (స్వర్ణోత్సవం)  జరుపుకొంటున్న చిత్రం జగపతి పిక్చర్స్ "ఆరాధన." ఈ చిత్రం 16-02-1962  లో విడుదల అయ్యింది. ఇందులో సావిత్రి గారిది డాక్టర్ అనురాధ పాత్ర. తనకు డాక్టర్ మురళి కృష్ణ (అక్కినేని) ప్రేమ లేఖ రాసాడని, అపార్థం చేసుకొని, అతనికి విదేశం వెళ్ళే అవకాశం పోగుడుతుంది. తరువాత నిజం తెలుసుకొని, అతన్ని ఆరాదిస్తుంది. అనురాధ పాత్రలో నటించింది అనడం కన్నా, ఆ పాత్రలో జీవించింది అనడం సబబుగా ఉంటుందేమో. సావిత్రి మీద చిత్రీకరించిన రెండు పాటల్లోనూ, ఆమె నటించిన తీరు అమోఘం. మొదటిది, "నీ చెలిమి నేడే కోరితిని, ఈ క్షణమే ఆశ వీడితిని". రెండోది " వెన్నెలలోని వికాసమే వెలిగించేద ఈ రేయి". పాట ఎంత మధురమో, ఆమె నటన అంత సునాయాసం, అద్భుతం. చిత్ర దర్శకుడు శ్రీ వి. మధుసూదన్ రావు గారు అంత బాగా చిత్రీకరించారు. సుశీల గారు అంత శ్రావ్యంగా పాడారు. సంగీతం:సాలూరు రాజేశ్వర రావు . గీత రచన: ఆత్రేయ.