Pages

Tuesday, July 3, 2012

"అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం"

సావిత్రి గారు అసాధారణ  నటి అని దేవదాస్ చిత్రం తోనే రుజువైంది. ఎన్నో చిత్రాలలో తన నటనా చాతుర్యంతో, ఇటు తెలుగు, అటు తమిళ  ప్రేక్షకులను కంట తడి పెట్టించిన నటనా శిరోమణి. ఎన్నో చిత్రాలు, ఆమె నటన వల్లే, విజయం సాదించింది అనడం అతిశయోక్తి కాదు. రక్తసంబంధం, బ్రతుకు తెరువు, మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి, సుమంగళి, అర్ధాంగి, ఆత్మబంధువు,  కోడలు దిద్దిన కాపురం, మొదలగునవి మచ్చుకు  కొన్ని మాత్రమే. బ్రతుకు తెరువు చిత్రంలో పి. లీల పాడిన "అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం" లో ఆమె నటనా చాతుర్యం చూడండి. అలాగే ఆ పాట మాధుర్యాన్ని ఆనందించండి. గీత రచన శ్రీ సముద్రాల జూనియర్, సంగీతం ఘంటసాల గారు.
 



Monday, June 4, 2012

"అలిగినవేలనే చూడాలి గోకుల కృష్ణుని అందాలూ"

మహానటి సావిత్రి -- కేవలం కళ్ళతోనే హావ భావాలూ ప్రదర్సించగల మేటి నటి.  నాటికీ, నేటికి ఆమె గొప్ప నటి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. గుండమ్మ కథ చిత్రంలో సావిత్రి ప్రదర్శించిన నటన అమోఘం. సావిత్రి, రామ రావు గార్ల మీద చిత్రీకరించిన "అలిగినవేలనే చూడాలి గోకుల కృష్ణుని అందాలూ" పాట చాల మంచి పాట. రచన శ్రీ పింగళి నాగేంద్ర రావు , సంగీతం: ఘంటసాల మాస్టారు. ఆ పాట వినండి.సావిత్రి నటనకు జోహార్లు తెలపండి.


Thursday, February 16, 2012

నీ చెలిమి నేడే కోరితిని.

 


సావిత్రి నటన సునాయాసంగా,సహజంగా ఉంటుంది. తను ధరించే పాత్రకు నూరు శాతం న్యాయం చేకూరుస్తుంది. అదే ఆమె గొప్పతనం. నేడు గోల్డెన్ జూబిలీ (స్వర్ణోత్సవం)  జరుపుకొంటున్న చిత్రం  
జగపతి పిక్చర్స్ "ఆరాధన." ఈ చిత్రం 16-02-1962  లో విడుదల అయ్యింది. ఇందులో సావిత్రి గారిది డాక్టర్ అనురాధ పాత్ర. తనకు డాక్టర్ మురళి కృష్ణ (అక్కినేని) ప్రేమ లేఖ రాసాడని, అపార్థం చేసుకొని, అతనికి విదేశం వెళ్ళే అవకాశం పోగుడుతుంది. తరువాత నిజం తెలుసుకొని, అతన్ని ఆరాదిస్తుంది. అనురాధ పాత్రలో నటించింది అనడం కన్నా, ఆ పాత్రలో జీవించింది అనడం సబబుగా ఉంటుందేమో. సావిత్రి మీద చిత్రీకరించిన "నీ చెలిమి నేడే కోరితిని, ఈ క్షణమే ఆశ వీడితిని," పాట, ఎంత మధురమో, ఆమె నటన అంత సునాయాసం, అద్భుతం. చిత్ర దర్శకుడు శ్రీ వి. మధుసూదన్ రావు గారు అంత బాగా చిత్రీకరించారు. సుశీల గారు అంత శ్రావ్యంగా పాడారు. సంగీతం:సాలూరు రాజేశ్వర రావు . గీత రచన: ఆత్రేయ.

ఆరాధన(1962)"వెన్నెలలోని వికాసమే"


 

సావిత్రి నటన సునాయాసంగా,సహజంగా ఉంటుంది. తను ధరించే పాత్రకు నూరు శాతం న్యాయం చేకూరుస్తుంది. అదే ఆమె గొప్పతనం. నేడు గోల్డెన్ జూబిలీ (స్వర్ణోత్సవం)  జరుపుకొంటున్న చిత్రం జగపతి పిక్చర్స్ "ఆరాధన." ఈ చిత్రం 16-02-1962  లో విడుదల అయ్యింది. ఇందులో సావిత్రి గారిది డాక్టర్ అనురాధ పాత్ర. తనకు డాక్టర్ మురళి కృష్ణ (అక్కినేని) ప్రేమ లేఖ రాసాడని, అపార్థం చేసుకొని, అతనికి విదేశం వెళ్ళే అవకాశం పోగుడుతుంది. తరువాత నిజం తెలుసుకొని, అతన్ని ఆరాదిస్తుంది. అనురాధ పాత్రలో నటించింది అనడం కన్నా, ఆ పాత్రలో జీవించింది అనడం సబబుగా ఉంటుందేమో. సావిత్రి మీద చిత్రీకరించిన రెండు పాటల్లోనూ, ఆమె నటించిన తీరు అమోఘం. మొదటిది, "నీ చెలిమి నేడే కోరితిని, ఈ క్షణమే ఆశ వీడితిని". రెండోది " వెన్నెలలోని వికాసమే వెలిగించేద ఈ రేయి". పాట ఎంత మధురమో, ఆమె నటన అంత సునాయాసం, అద్భుతం. చిత్ర దర్శకుడు శ్రీ వి. మధుసూదన్ రావు గారు అంత బాగా చిత్రీకరించారు. సుశీల గారు అంత శ్రావ్యంగా పాడారు. సంగీతం:సాలూరు రాజేశ్వర రావు . గీత రచన: ఆత్రేయ.